డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులివ్వాలి
నిజామాబాద్‌అర్బన్: జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు మద్దతుగా టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143) నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జమాల్‌పూర్ గణేశ్, భూపతి, సుభాష్, పంచరెడ్డి శ్రీకాంత్, రాంచందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, డెస్క్ జర్నలిస్టుల ఫోరం అడహక్ కమిటీ కన్వీనర్ చిట్నే భీంరావ్, కో–కన్వీనర్లు శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, నరేంద్ర, స్వామి, రాకేష్, సందీప్, సలహాదారులు కేవీ రమణ, భద్రారెడ్డి, ప్రభాకర్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.


