నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవింద్‌పేట్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో సత్య నారాయణ గౌడ్, సర్పంచ్ అప్పాల గణేశ్, ఉపసర్పంచ్ దార్ల సుశీన్, కుమార్, వీడీసీ చైర్మన్ కాశిరెడ్డి భోజన్న తదితరులు పాల్గొన్నారు.
వర్ని: వర్ని ఎస్సైగా వంశీకృష్ణ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు వర్ని ఎస్సైగా పనిచేసిన మహేశ్‌ను సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వంశీకృష్ణను వర్నికి ఎస్సైగా బదిలీ చేశారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ప్రయివేట్ భవనంలో కొనసాగుతున్న అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని అధికారులు గురువారం ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లోకి మార్పు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలు కొనసాగరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఏసీబీ కార్యాలయాన్ని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు మార్చారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విశ్వహిందూ పరిషత్ గోరక్ష తెలంగాణ ప్రాంత ప్రముఖ్‌గా ఇందూరు నగరానికి చెందిన ధాత్రిక రమేశ్ నియమితులయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వీహెచ్‌పీ గోరక్ష ప్రాంత సమావేశంలో ఇందూరు విభాగ్ పరిధిలోని ఇందూరు జిల్లా సహకారదర్శిగా ఉన్న ధాత్రిక రమేశ్‌ను తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం ‘టోలి’ సభ్యుడిగా ఎంపిక చేయడంతో పాటు తెలంగాణ ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఈమేరకు గురువారం ఆయన వీహెచ్‌పీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు గోఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించే విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి, జిల్లా సభ్యులు ఆయనను సన్మానించారు. వీహెచ్‌పీ ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ్ రామ్ ప్రసాద్ ఛటర్జీ, నవీన్, ఘన్‌శ్యాం తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు


