కమ్మర్‌పల్లి మండలంలో వృద్ధుడు..
కమ్మర్‌పల్లి: మండలంలోని శ్రీరాజరాజేశ్వరీ నగర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా.. శ్రీరాజరాజేశ్వరీనగర్‌కు చెందిన కాల గంగాధర్(62) అనే వ్యక్తి గురువారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా, ఉప్లూర్ వైపు నుంచి జగిత్యాల జిల్లా ఇ బ్రహీంపట్నం మండలం వర్షకొండకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన గంగాధర్ అ క్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరా లు సేకరించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సల్కం దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇందల్వాయి: మండలంలో ని వెంగల్‌పాడ్ గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. వివరాలు ఇలా.. వెంగల్ పాడ్ గ్రామానికి చెందిన లావుడియా రాజు (33) అనే వ్యక్తి గురువారం ఉదయం తన ఇంట్లోని ఫ్యాన్ స్విచ్ తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెద్దవాల్గోట్‌లో..
సిరికొండ: సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దవాల్గోట్ శివారులో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పెద్దవాల్గోట్‌కు చెందిన బోదాస్ నర్సయ్య(43) అనే వ్యక్తి గురువారం వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


