క్రైం కార్నర్
మందుల కోసం వెళ్లి మృత్యువాత
● ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి
● లచ్చాపేటలో విషాదఛాయలు
మాచారెడ్డి: మందుల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై అనంత లోకాలకు చేరారు. ఈ ఘటన గురువారం మాచారెడ్డి మండలం లచ్చాపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపన వివరాలి లా ఉన్నాయి. లచ్చాపేట గ్రామానికి చెందిన జక్కుల సాయి (22), మిరుదొడ్డి అజయ్ (22) ప్రాణ స్నేహితు లు. సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలయ్యా డు. నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాడు. మందులు అయిపోవడంతో స్నేహితుడు అజయ్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గజ్యానాయక్ తండా చౌరస్తాకు వెళ్లి మందులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్ లచ్చాపేట స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
మృత్యువులోనూ వీడని బంధం
మృతులు సాయి, అజయ్ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. చేతికి అందిన కొడుకులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు జక్కుల సాయికి తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యలతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అజయ్‌కు సైతం తల్లిదండ్రులు లక్ష్మి, నరసింహులుతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసుకున్నారు.
చందూర్‌లో మహిళ..
వర్ని: చందురు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హంస్డా (30) ఇటీవల వ్యవసాయ పనుల కోసం చందూరుకు వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంది. బుధవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా, చందురు శివారులో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


