బియ్యంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి
సుభాష్‌నగర్: ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త లు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూ చించారు. నగర శివారులోని ఖానాపూర్ ప్రాంతంలో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్‌మిల్లును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెన్నెల్ రైస్‌ను ఉత్పత్తి చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫోర్టి ఫైడ్ రైస్‌ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. దీని తయారీ విధానాన్ని గమనించి, మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.


