క్రీడలతోపాటు చదువులోనూ ముందుండాలి
● బీసీ గురుకులాల ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులు క్రీడలతోపాటు చదువులోనూ ముందుంజలో ఉండాలని మహాత్మా జ్యోతీబాపూలే ఉమ్మడి జిల్లా ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంజర్ శివారులో ఉన్న ఎంజేపీ బాలుర గురుకుల పాఠశా లలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్ మీట్‌లో ఉ త్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బుధవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సత్యనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ తుర్కపల్లిలో డిసెంబర్ 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వ హించారన్నారు. అందు లో జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబర్చాయని, అండర్–19,17 వాలీబాల్ పోటీల్లో మొదటిస్థానంలో నిలిచారని తెలిపారు. మార్చ్‌ఫాస్ట్‌లో ప్రథ మ, ఖోఖోలో ద్వితీయ, టెన్నికాయిట్‌లో ద్వితీయ స్థానం,అండర్–19 అథ్లె టిక్స్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌షిప్ సాధించారన్నారు. కంజర్ గురుకుల ప్రిన్సిపాల్, జిల్లా కో ఆర్డినేటర్ మురళీ, పీడీ రంజిత్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


