రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
సిరికొండ: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ నాగేష్ బుధవారం తెలిపారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన అఖిల, రుపిక, అశ్విని, వైదిక, సంస్కృతి, బి అఖిల, పల్లవి, సోఫియా ఎంపికయ్యారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులను ఎంఈవో రాము లు, ఇంచార్జి హెచ్‌ఎం మనోహర్, ఉపాధ్యాయులు, సర్పంచ్, వీడీసీ సభ్యులు అభినందించారు.
కబడ్డీ పోటీలకు పడకల్ విద్యార్థిని..
జక్రాన్‌పల్లి: కరీంనగర్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు పడకల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పద్మావతి ఎంపికై నట్లు పీడీ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఐదు రోజుల నుంచి పడకల్ గ్రామంలో నిర్వహించిన సీనియర్ కబడ్డీ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన పద్మావతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యిందన్నారు. ఈ సందర్భంగా పద్మావతిని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్, పాఠశాల హెచ్‌ఎం గడ్డం సురేందర్ రెడ్డి తదితరులు అభినందించారు.
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక


