కథ శివిర్‌కు ఉమ్మడి జిల్లా విద్యార్థులు
● 27 నుంచి జనవరి 4 వరకు
గుజరాత్‌లో శిబిరం
● నిజామాబాద్ నుంచి 15,
కామారెడ్డి నుంచి 7 మంది ఎంపిక
ఖలీల్‌వాడి : విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సాంస్కృతిక, వ్యక్తిగత అభివృద్ధి తదితర అంశాలపై శిక్ష ణ కల్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. శ్రీ వేదిక్ మిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజు లపాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించను న్నది. అందుకు నిజామాబాద్ జిల్లా నుంచి 15 మంది, కామారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులను ప్రత్యేక శిబిరానికి ఎంపిక చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా ఉప్లేట తాలూక ట్రాన్స్ లో ని ర్వహించే శిబిరానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు బ యల్దేరి వెళ్లారు. ఈ శిబిరంలో భారత రాజ్యాంగం, జాతీయ సమైక్యత, సాంస్కృతి, వ్యక్తిగత అభివృద్ధి, జాతీయవాదం, దేశభక్తి, జాతీయ భద్రత సమస్య లు, శక్తి, పర్యావరణం, డిజిటల్ ఇండియా, నీటి సంరక్షణ, మానవ హక్కులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక, సామాజిక సామరస్యం, విప త్తు నిర్వహణ, రహదారి భద్రత నియమాలు, క్రీడ లు, యోగా తదితర అంశాలపై శిక్షణనిస్తారు.


