ఐటీ సెల్ పోలీసులకు ప్రశంస పత్రాల అందజేత
నిజామాబాద్‌అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీసెల్ పోలీస్ సి బ్బంది మంగళవారం అడిషనల్ డీజీ టెక్నికల్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్‌రావు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. పో లీస్ ఐటీ అప్లికేషన్స్ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఐటీ సెల్ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్, నిజామాబాద్ డివిజన్ ఇన్‌చార్జి రాహుల్‌కు ప్రశంసపత్రలు అందించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంస పత్రాలను అందజేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో ఉ త్తమ సేవలు అందిస్తున్న కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, శ్రీకాంత్‌లకు ప్రశంస పత్రాలు అందించారు.
ఖలీల్‌వాడి: నగరంలోని దుబ్బలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ, ఉపాధ్యాయ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు యానం విజయ్‌కుమార్ సమక్షంలో ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎ. పోశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు భోజన్న, కోశాధి కారిగా బీ నాగరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి లింగయ్య, ఎస్ గంగాధర్, ఎన్ ప్రభాకర్, సుధా గడపాలి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్, జిల్లా బాధ్యులు వై రాజేశ్వర్, పీ రాజేశ్వర్, పీ పెద్దన్న, తాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నందిపేట్: మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రైతుల వేషధారణలో ఆకట్టుకున్నారు. నందిపేట శివారులోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కరస్పాండెంట్ బండి రామాగౌడ్, మాధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఐటీ సెల్ పోలీసులకు ప్రశంస పత్రాల అందజేత
ఐటీ సెల్ పోలీసులకు ప్రశంస పత్రాల అందజేత
ఐటీ సెల్ పోలీసులకు ప్రశంస పత్రాల అందజేత


