బియ్యం బస్తాల దొంగతనానికి యత్నం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులో ఉన్న గోదాం బయట ఉన్న లారీ నుంచి బియ్యం బస్తాలను దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి అర్ధరాత్రి ఖానాపూర్ శివారులో ఉన్న గోదాం బయట ఉన్న లారీ నుంచి జిల్లా కేంద్రానికి చెందిన రఫిక్, అబుబకర్, ఫిరోజ్‌లు బియ్యం బస్తాలను చోరీకి పాల్పడుతుండగా అక్కడే ఉండి గమనిస్తున్న ఓ వ్యక్తి గట్టిగా అరవడంతో వారు వారిపోయారు. స్థానికుడు శివలింగ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
జక్రాన్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన సాయిలు(32) మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బియ్యం బస్తాల దొంగతనానికి యత్నం


