సాంకేతిక పద్ధతులతో కేసుల పరిష్కారానికి కృషి
నిజామాబాద్‌అర్బన్: కాలానికి అనుగుణంగా సాంకేతిక పద్ధతులతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్‌స్టేషన్ రైటర్స్‌కు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కేసుల్లో కొత్తదనం తీసుకొచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో నాణ్యతను పెంచి ఎఫ్‌ఐఆర్ నుంచి అంతిమ రిపోర్టు వరకు ఉండాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. స్టేట్‌మెంట్ రికార్డుపై గోప్యత పాటించాలన్నారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. నేరానికి నేర స్థలానికి జత చేయడం, నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ పద్ధతులను ఉపయోగించాలో వివరించారు. అంతిమ రిపోర్టును కోర్టుల్లో ఎలా సమర్పించాలో సిబ్బందికి అవగాహన కల్పించారు. స్టేషన్ రైటర్స్ తమ పీఎస్‌లకు వెళ్లిన తర్వాత సిబ్బందికి, సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకున్నవి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, టౌన్ సీఐ శ్రీనివాస్‌రాజ్, శిక్షణ సీటీసీ ఇన్‌స్పెక్టర్ శివరాం, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.


