బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ రూరల్: నగరంలో విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించి, బంగ్లాదేశ్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అఖిలభారత విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు ప్రతి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయనంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్,జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, హిందూవాహిని జిల్లా సంయోజక్ సాయి ప్రసాద్, ధాత్రిక రమేష్,నగర అధ్యక్షులు కోడిమేలా శ్రీనివాస్, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, నగర సహకార్యదర్శి సతీష్, బజ్‌రంగ్‌దళ్ నగర సహా సంయోజక్ అఖిలేష్, మహేష్, తులసిదాస్, హర్షవర్ధన్, కార్తీక్, బంజా రమేష్, శ్యాం, సంపత్, శ్రీనివాస్ తదితరులున్నారు.


