ప్రజలపై ఏసుప్రభు కృప ఉండాలి
నిజామాబాద్ రూరల్: జిల్లా ప్రజలపై ఏసుప్రభు కృప ఉండాలని సీఎస్‌ఐ చర్చి రెవరెండ్ సీహెచ్.జార్జ్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ నివాసంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అంతకు ముందు క్రైస్తవులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్‌హుందాన్, ఆకుల రాజేశ్వర్, రూరల్ సీఐ సురేష్‌కుమార్, వెంకట్‌రెడ్డి, రెవరెండ్ కృపాకర్, రెవరెండ్ అరోన్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.


