జిల్లా పద్మశాలి యువజన సంఘం కార్యవర్గం
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మైసల నారాయణ, ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఖలీల్‌వాడిలోని జిల్లా సంఘం కార్యాలయంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజం అభిలాష్, జిల్లా కోశాధికారిగా గెంట్యాల అజయ్‌లను నియమించినట్లు తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు, జిల్లా అధ్యక్షులు మైసల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగాప్రసాద్, సలహదారులు గెంట్యాల వెంకటేశ్, కార్యవర్గ సభ్యులు బాబురావు, చింతకింది సంతోష్ తదితరులున్నారు.


