47వ డివిజన్‌లో నుడా చైర్మన్ పర్యటన
సుభాష్‌నగర్: నగరంలోని 47వ డివిజన్ పూసలగల్లిలో నుడా చైర్మన్ కేశవేణు మంగళవారం పర్యటించారు. డివిజన్‌లో శానిటేషన్, మురుగుకాలువలు, చెత్తచెదారంపై ఫిర్యాదులు రావడంతో ఆయన డీసీ రవిబాబుతో కలిసి సందర్శించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మురికికాలువలను శుభ్రం చేసి చెత్తచెదారాన్ని తొలగించాలని నుడా చైర్మన్ అధికారులను ఆదేశించారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండ కాలువలను శుభ్రం చేయాలన్నారు. డ్రెయినేజీ నీరు తాగునీటి పైప్‌లైన్లలో కలస్తున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకరావడంతో సమస్యను పరిష్కారించాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాలనీవాసులు, అధికారులు ఉన్నారు.


