అన్ని మతాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది
● ప్రతిపేదవాడికి సంక్షేమ పథకాలు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ధర్పల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లు నిధులు మంజూరు చేసింది అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు చెందిన క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ భవనాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్నాయన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, చర్చి ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిక
సిరికొండ: మండలంలోని కొండాపూర్ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగుల రాజేశ్వర్‌గౌడ్, వార్డు సభ్యుడు మిద్దెల నరేష్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సర్పంచ్ నీరటి మానసశ్రీధర్, పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్యెల్యేను మంగళవారం మర్యాదపూర్వకంగా కలి శారు. సర్పంచ్‌ను, ఉపసర్పంచ్, పార్టీ నాయకులను ఎమ్మెల్యే సన్మానించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, గౌసోద్దీన్, చంద్రాగౌడ్, ఆకుల జగన్, కిషోర్‌గౌడ్, నల్ల బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
మోపాల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిని మోపాల్ సర్పంచ్ ద్యాప రవికుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ మద్దతుతో రవి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి ద్యాప రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచి రవి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. మోపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అవసరమైన నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు, వార్డుసభ్యులు అంగలి నవీన్‌రెడ్డి, సతీష్, కిరణ్, మిర్యాల నరేష్, తదితరులు ఉన్నారు.
అన్ని మతాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది


