వ్యవసాయాన్ని కాపాడుకుందాం
మోపాల్‌లో రైతులను సన్మానిస్తున్న
ఎఫ్‌పీవో ప్రతినిధులు
వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థులు
రైతు నర్సారెడ్డిని సన్మానిస్తున్న టీచర్లు
మోపాల్: ప్రస్తుత రోజుల్లో రైతులను రక్షించుకుని.. వ్యవసాయాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందూరు డిచ్‌పల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ అగ్గు చిన్నయ్య పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో మోపాల్‌లో మంగళవారం ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. కదం పెంటయ్య, తిరుపతి సంజీవ్, కెంపు పోతన్న, కెంపు మల్లయ్య, గోపని ఆశన్నను సత్కరించారు. ఈసందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వాసరి సాయినాథ్, తుంగపల్లి రాజ్‌కుమార్, బండమీది నర్సయ్య, భరత్, సిరిపురం సాయిలు, దండు సరోజ, దండు లత, తదితరులు పాల్గొన్నారు.
రైతుకు సన్మానం
ఖలీల్‌వాడి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో బాడ్సికి చెందిన రైతు నల్ల నర్సారెడ్డిని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం సన్మానించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా రైతును ఘనంగా సన్మానించినట్లు జిల్లా సైన్స్ అధికారి కే.గంగా కిషన్ తెలియజేశారు. జిల్లాస్థాయి స్పెల్‌బీ, క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. జీవన్, కాంతారావు, చంద్రశేఖర్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
విద్యార్థుల పొలంబాట
సిరికొండ/నిజామాబాద్ రూరల్ : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం పొలంబాట పట్టారు. వృత్తి విద్య కోర్సులో భాగంగా పొలాలను, ఆరు తడిపంటల తోటలను సందర్శించారు. విద్యార్థులకు మిశ్రమ పంటల సాగు విధానాలను, పంటల ఎంపిక, దిగుబడులు, ఖర్చు–లాభాల వివరాలను వివరించారు.
రైతులు చెరుకుపల్లి రామన్న, కొలిప్యాక సాయవ్వ, గ్యామ శోభన్‌లను విద్యార్థులు సన్మానించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్‌రెడ్డి, వృత్తి విద్య కోర్సు ఉపాధ్యాయులు జాడి సాయివినయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ జేవియర్స్ విద్యార్థులు ధర్మారం గ్రామంలో రైతుల పొలాలను సందర్శించారు. ఈసందర్భంగా క్లబ్ చైర్మన్ నర్సింహరావు మాట్లాడారు.కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, రైతులు, పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని కాపాడుకుందాం
వ్యవసాయాన్ని కాపాడుకుందాం


