వామపక్షాల నిరసన
నిజామాబాద్ రూరల్: ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీఎంఎల్ మాస్ లైన్, ఆర్‌ఎస్పీ లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడారు. కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపనుందని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఆచట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.600 ల కూలీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ిసీపీఐ నాయకులు అన్వర్, ఆర్‌ఎస్పీ నాయకులు అనిల్, లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, సీపీఎం నాయకులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్ డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్ లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న ఆర్‌ఎస్పీ నాయకులు రాములు, నరేష్, వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్/నిజామాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు పార్టీ నాయకులతో కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాక్లూర్ మండలం వెంకటాపూర్ సర్పంచ్ ధాత్రి అంజయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దండు శేఖర్, రాజు సంతోష్, రాజు, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అలాగే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) చౌరస్తాలో గల పీపీ విగ్రహానికి బ్రాహ్మణ సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు ఉన్నారు.
వామపక్షాల నిరసన


