హైస్కూల్‌కు బెంచీల వితరణ
మోపాల్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి 320 డీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మండలంలోని సిర్‌పూర్ ఉన్నత పాఠశాలకు మంగళవారం డ్యూయల్ డెస్క్ బెంచీలను వితరణ చేసినట్లు హెచ్‌ఎం సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించినప్పుడే ఇలాంటి సంస్థలు అందించే చేయూత సఫలమవుతుందని తెలిపారు. విద్యార్థుల కోసం మున్ముందు లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. పాఠశాలకు రూ.లక్షా 5వేలు వెచ్చించి 30 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతీ 320డీ కి హెచ్‌ఎం సత్యనారాయణ, సర్పంచి బొడ్డు గౌతమి గణేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసి నిధులు తెప్పించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్‌రావును అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ అడ్వయిజర్ సూర్య రాజ్, సభ్యులు లయన్ సుజాత సూర్యరాజ్, విజయలక్ష్మీ, సుష్మ, శాస్త్రి, ప్రవీణ్, సాయిబాబు, ప్రైమరీ హెచ్‌ఎం లాటికర్ రాము, ఏఏపీ చైర్‌పర్సన్ స్రవంతి, వీడీసీ సభ్యులు గంగాధర్, కిషన్, ఉపాధ్యాయులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.


