ప్రభుత్వ పాఠశాల తనిఖీ
సిరికొండ: మండలంలోని జంగిలోడి తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ బుక్యా గంగాధర్ మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, వసతులపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నర్సరీని తనిఖీ చేశారు. మొక్కలు ఎన్ని పెంచుతున్నారు.. ఎన్ని మొక్కలు నాటారు అనే విషయాలను తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఉన్నారు.
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి, జిల్లా ప్రజల మన్ననలు పొందిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలిసి శాలువతో సన్మానించి, మెమోంటోను అందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా అధ్యక్షులు శిరప్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, పురుషోత్తం రావు, భోజరావు, మధుసూదన్, సాగర్, శంకర్, బాలస్వామి, శేఖర్ తదితరులున్నారు.
ప్రభుత్వ పాఠశాల తనిఖీ


