నిఖత్‌కు అభినందనల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

నిఖత్‌కు అభినందనల వెల్లువ

Nov 21 2025 7:33 PM | Updated on Nov 21 2025 7:33 PM

నిఖత్‌కు అభినందనల వెల్లువ

నిఖత్‌కు అభినందనల వెల్లువ

బాక్సింగ్‌ క్రీడకు వన్నె..

నిఖత్‌ మాకు స్ఫూర్తి

జయహో..

ఆట తీరు మరింత బలం

ప్రపంచ బాక్సింగ్‌

చాంపియన్‌ షిప్‌లో గోల్డ్‌ మెడల్‌

51 కేజీల విభాగంలో ఘనత

సాధించిన క్రీడాకారిణి

నిజామాబాద్‌నాగారం : తనదైన పంచులతో ప్రత్యర్థుల ను చిత్తు చేస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయి లో రాణిస్తున్న బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించింది. దీంతో వరుసగా మూడుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్స్‌ అందుకుని స్ఫూర్తిగా నిలిచింది.

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాం పియన్‌షిప్‌ పోటీలో నిఖత్‌ జరీన్‌ 51 జీల విభాగంలో చైనీస్‌తైపి (తైవాన్‌కు) చెందిన క్రీడాకారిణి గువోజీ జువాన్‌పై 5–0 తేడాతో గెలుపొందింది. విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది. 211 సంవత్సరంలో జూనియర్‌స్థాయిలో బంగారు పతకం, 2013 సంవత్సరంలో యూత్‌ లెవల్‌లో సిల్వర్‌ మెడల్‌లు సాధించారు.

హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ ఇలా..

● 2022 సంవత్సరంలో జరిగిన 51 కేజీల విభాగంలో ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించారు.

● 2023 సంవత్సరంలో వరల్డ్‌ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించారు.

● 2024 సంవత్సరంలో ఒలింపిక్‌ ఉండడంలో సుమారు 20 నెలల పాటు టోర్నమెంట్‌లు లేవు.

● తాజాగ ఈ ఏడాది మూడోసారి ముచ్చటగా చాంపియన్‌గా నిలిచింది.

బాక్సింగ్‌లో రాణిస్తూ ప్రపంచస్థాయిలో చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌జరీన్‌ బాక్సింగ్‌ క్రీడకే వన్నె తెస్తోంది. నిలకడ గా రాణిస్తూ ఉన్నతంగా ఎదుగుతోంది. ప్రతినిత్యం సాధన చేస్తేనే సాధ్యం అవుతుంది. నేను నాలుగు సార్లు రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించాను. జాతీయస్థాయిలో గోల్డ్‌ సాధించడానికి ప్రతి నిత్యం శిక్షణ తీసుకుంటున్నాను. ప్రస్తుతం కేర్‌ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నాను.

– ఇంతియాజ్‌,

డిగ్రీ మొదటి సంవత్సరం

నిఖత్‌జరీన్‌ వరల్డ్‌ బా క్సింగ్‌ చాంపియన్‌షిప్‌ లో బంగారు పతకం సా ధించడం చాలా సంతోషం. మా లాంటి ఎంతో మంది బాక్సింగ్‌ క్రీడాకారులకు స్ఫూర్తి. తను ప్రత్యర్థులను చిత్తు చేసే వి ధానం చూసి మేము కూడా నేర్చుకుంటున్నారు. నేను గత నాలుగు సంవత్సరాలుగా బాక్సింగ్‌ లో శిక్షణ తీసుకుంటున్నాను. షైన్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. రాష్ట్రస్థాయిలో రెండుసార్లు గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. – అయానొద్దీన్‌,

ఇంటర్‌ మొదటి సంవత్సరం

జిల్లా నుంచి బాక్సింగ్‌ క్రీడలో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న మొదటి క్రీడాకారిణి ని ఖత్‌. పతకాలు సాధిస్తూ దేశానికి, రాష్ట్రానికి, జి ల్లాకు కీర్తీ తెస్తూనే ఉంది. మాకు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెలా ఎదగానికి ప్రత్యేకంగా మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. జయహో నిఖత్‌. నేను ప్రస్తుతం బ్లూమింగ్‌బడ్స్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుకుంటున్నాను.

– అద్వైత, 7వ తరగతి

బాక్సింగ్‌ రింగ్‌లో నిఖత్‌ ఆడుతున్న సమయంలో చూస్తే మాకు ఎంతగా నో ట్రిక్స్‌ తెలుస్తున్నా యి. తన ఆట తీరు చా లా వేగంగా ప్రత్యర్థులకు అర్థం కాకుండా ఉంటుంది. అలాంటి ట్రిక్స్‌ నేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాను. కచ్చితంగా నిఖత్‌ మాదిరి గా ఎదగడానికి కఠోరంగా శిక్షణ తీసుకుంటా ను. ప్రస్తుతం నిర్మల హృదయ స్కూల్‌లో చదువుకుంటున్నాను. – హుమేహానీ, 7వ తరగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement