రికార్డులు.. సెల్‌ఫోన్లు సీజ్..!
● అర్ధరాత్రి ఒంటి గంట వరకు
ఏసీబీ సోదాలు
● టౌన్‌ప్లానింగ్ టీపీఎస్‌లే
లక్ష్యంగా విచారణ..?
సుభాష్‌నగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు బుధవారం అ ర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీపీలు, టీపీవోలు, టీపీఎస్‌లు, టీపీబీవోల సెల్‌ఫోన్లు, ఇటీవల కాలంలో ఎల్‌ఆర్‌ఎస్, మ్యుటేషన్, వెంచర్ల అనుమతులు, తదితర రి కార్డులను పరిశీలించి సీజ్ చేసినట్లు తెలిసింది. ము ఖ్యంగా టీపీఎస్‌లు అనుపమ, రాజేష్ లక్ష్యంగా ఏ సీబీ అధికారుల విచారణ కొనసాగినట్లు సమాచారం. నిత్యం ప్రజలతో కిటకిటలాడే టౌన్‌ప్లానింగ్ వి భాగం ఏసీబీ సోదాలతో ఒక్కసారిగా బోసిపోయింది. ఉదయం 11.30 గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ఆపరేటర్లు, అటెండర్లు మాత్రమే దర్శనమిచ్చారు.
ఆది నుంచి ఆరోపణలే..!
కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆది నుంచి అవినీతి, ఆరోపణలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులు, వెంచర్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, వ్యాపార భవనాలు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతు లు ఇవ్వడం వంటి పనులు టౌన్ ప్లానింగ్ విభాగం పరిశీలిస్తోంది. ఈ వ్యవహారాలను చక్కదిద్దేందుకు టీపీబీవోలు, టీపీఎస్‌లు రూ.లక్షల్లో డబ్బులు డి మాండ్ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఫారసుల ద్వారా వెళ్లే వారికి నిబంధనల సాకు చూపి ఆ ఫైళ్లను తిరస్కరిస్తున్నారని చె బుతున్నారు. అడిగినంత ఇచ్చుకోనిదే ఈ విభాగంలో పనులు కావనేది బహిరంగ రహస్యం.
అనుమతులపై ఆరా..?
మున్సిపల్ పరిధిలో సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. ఎల్‌ఆర్‌ఎస్, అపార్ట్‌మెంట్లకు అనుమతులు, వెంచర్లు, తదితర అనుమతుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించి ఏసీపీ, టీపీవోలను విచారించారు. అనుమతుల విషయంలో ఏసీబీకి అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న రికార్డులను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.


