సహకార వ్యవస్థతోనే దేశాభివృద్ధి
● ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి
సుభాష్‌నగర్ : సహకార వ్యవస్థ బలపడినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు వేడుకలను చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. రమే శ్‌రెడ్డి మాట్లాడుతూ సహకార ఉద్యమానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పునాది వేశార ని కొనియాడారు. సహకార ఉద్యమం వల్లే గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన పెరిగిందన్నారు. జిల్లా సహకార బ్యాంకు కూడా అదే తత్వంతో ప్రజలకు సేవలందిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు గొర్కంటి లింగన్న, ఆనంద్, బ్యాంకు అధికారులు లింబాద్రి, శ్రీధర్‌రెడ్డి, సుమమాల, సహా య జనరల్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


