
పంటలను ముంచిన గోదావరి!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షం, బోధన్ డివిజన్‌లో ఉధృతంగా ప్రవహించిన మంజీర నది, శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ బోధన్, సాలూరా, రెంజల్ మండలాల్లోని పలు గ్రామాలను నీట ముంచాయి. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 48,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. ఇందులో 1,026 ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. శ్రీరాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 5,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 38 గేట్ల ద్వారా 4,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
● బోధన్ రెవెన్యూ డివిజన్‌లో మంజీర నది ఉధృతి తగ్గినప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మంజీర ఉధృతికి రెండు రోజులపాటు జల దిగ్బంధంలో చిక్కిన సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్ గ్రామాల నుంచి వరద నీరు బయటకు వెళ్లిపోయింది. సాలూర–ఖాజాపూర్, ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. హున్సా, మందర్నా గ్రామాల మధ్య వాగు వంతెన మీదుగా పారుతోంది. సాలూ ర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, తగ్గేల్లి, సాలూర గ్రామాల శివార్లలో మంజీర నది, ఇతర వాగుల వరదతో సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు మునిగిపోయా యి. శనివారం వరద తగ్గడంతో స్వల్పంగా పంట లు తేలాయి. బోధన్ మండలంలోని హంగర్గ గ్రా మంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నిలకడగా ఉంది. హంగర్గ, కోపర్గ, బిక్నెల్లి, ఖండ్‌గామ్ గ్రామాల శివార్లలో సోయా, వరి పంటలు నీట మునిగాయి.
● రెంజల్ మండలంలోని గోదావరి వరదతో కందకుర్తి, నీల, తాడ్‌బిలోలి, బోర్గం గ్రామాల శివార్లలో సోయా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. న వీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన యంచ, కోస్లీ, అల్జాపూర్, నాలేశ్వరం, తుంగిని, నందిగామ శివార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పోతంగల్ మండలంలోని మంజీర తీరాన ఉన్న హెగ్డోలి, కల్లూరు, సుంకిని, హంగర్గ, కారేగాం, పొతంగల్ గ్రామాల శివారుల్లో సో యా, వరి పంటలు నీటమునిగాయి. ఇక సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి ఖాజాపూర్, హున్సా గ్రామస్తులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
● ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ముత్యాలవాగు వరద ప్రవాహంతో దిగువన ఉన్న బీరప్పతండా, వాడి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పంట భూములు కోతకు గురయ్యాయి. ఇసుక మేటలు వే శాయి. వాడి గ్రామం ముంపునకు గురికావడంతో 20 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లలోకి వరద రావడంతో నిత్యావసరా లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర సామగ్రి పూర్తిగా బురదమయమై పనికిరాకుండా పోయాయి. శనివారం ఉదయం నుంచి వాడి గ్రామంలో వరద బాధితులు తమ ఇళ్లలోని బురదను శుభ్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో రెండు రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ చేశారు.
సిరికొండ మండలం కొండూర్‌లో
తడిసిన బియ్యం సంచులు
ఇళ్లు కోల్పోయి..
సిరికొండ మండలంలో కప్పలవాగు ఉప్పొంగడంతో కొండూరు గ్రామం అతలాకుతలమైంది. గ్రామంలోకి ఆకస్మికంగా వరద పోటెత్తడంతో గ్రామస్తులు కట్టుబట్టలతో ఊరి నుంచి బయటకు వచ్చి పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు. వరద ప్రవాహానికి గ్రామంలో 10 ఇళ్లు కూలిపోయాయి. 50 కుటుంబాలకు చెందిన ఆ ధార్, రేషన్ కార్డులు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర నిత్యావసరాలు కొట్టుకుపోయా యి. 200 ఇళ్లల్లోకి భారీగా బురద చేరింది. గ్రామస్తులు గత రెండు రోజులుగా పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలోకి వచ్చిన భారీ వరద దిగువన గోదావరి పరీవాహక ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. గోదావరిలోకి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో మెండోరా మండలం దూదిగాం, చాకీర్యాల్, కోడిచర్ల, సావెల్ గ్రామాల్లో సుమారు 400 ఎకరాల వరకు నీట మునిగింది. శుక్రవారం సాయంత్రం గోదావరిలోకి నీటి విడుదల పెంచగానే ఒక్కసారిగా ప్రవాహం పెరిగి దూదిగాంలో మొక్కజొన్న, సోయా, చాకీర్యాల్ వరి పంటల్లోకి నీరు చేరింది. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

పంటలను ముంచిన గోదావరి!

పంటలను ముంచిన గోదావరి!

పంటలను ముంచిన గోదావరి!

పంటలను ముంచిన గోదావరి!