సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో ఉప్పారం మల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తహసీల్దార్ రవీందర్‌రావు శనివారం తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ. లక్ష అరవై వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎమ్మారై గంగరాజం సందర్శించి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో నాలుగు లక్షల పది వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తహసీల్దార్ తెలిపారు.
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బాన్సువాడ: బీర్కూర్‌లోని కాలబజార్ గల్లీలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు గల్లీలోని పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3080 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.