
మాటలకందని విషాదం
నీరు తగ్గే అవకాశం లేదు..
● వరదలతో ఇళ్లు దెబ్బతిని
సర్వం కోల్పోయిన పలువురు
● కట్టుబట్టలే మిగిలిన వైనం
సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో వరద సృష్టించిన బీభత్సంతో మాటలకందని విషాదం నెలకొంది. వరద కారణంగా పది వరకు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో ఇరవై అయిదు ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. 190 ఇళ్లలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా తడిచిపోయాయి. క్వింటాళ్ల కొద్ది బియ్యం తడిసిపోవడంతో వాగులో పడేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వరద ఒక్కసారిగా రావడంతో వాగు సమీపంలో ఉన్న వారందరు కట్టుబట్టలతో సురక్షిత ప్రదేశానికి తరలివెళ్లారు. బంగడి బాబయ్య అనే వ్యక్తి ఇల్లు అడుగు భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇంట్లోని సామగ్రి, విలువైన పత్రాలు సైతం వాగులో కొట్టుకుపోయాయని బాధితుడు వాపోయాడు. ఇళ్లలో బురద, చెత్త నిండిపోవడంతో గ్రామస్తులు శనివారం కూడా ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుంటూనే ఉన్నారు. వరదతో ఇబ్బందులకు గురైన వారిని పరామర్శించేందుకు బంధువులు తరలివస్తుండగా, వారిని ఓదారుస్తు బంధువులు రోదించడం గ్రామస్తులను కలచివేస్తోంది.
రెంజల్(బోధన్): 42 సంవత్సరాల తర్వాత గోదావరి నది పోటెత్తడంతో రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం రాత్రి నుంచి కాలనీవాసులు జాగారం చేయాల్సి వచ్చింది. అధికారులు పలువురిని పునరావాస కేంద్రాలకు బలవంతంగా తరలించారు. శనివారం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకుని నీటిని తొలగిస్తున్నారు. ఇళ్ల ముందు నీరు వెళ్లే దారి లేకపోవడంతో మరికొందరు గ్రామంలోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారు.
కూలిన ఇంట్లోంచి సామగ్రిని తీస్తున్న బాధితులు
వరద నీరు ఇంటి ముందు చెరువును తలపిస్తోంది. ఇంట్లోకి చేరడంతో నిత్యావసర వ స్తువులు, బట్టలు పూర్తిగా తడి సి ముద్దయ్యాయి. తినేందుకు తిప్పలు పడాల్సి వస్తుంది. రాత్రి పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లారు. శనివారం ఇంటికి చేరుకుని కుటుంబం మొత్తం నీటిని తొలగించేందుకు తంటాలు పడుతున్నాం. ఇంట్లోని నీటిని తొలగించినా ఇంటి ముందు చేరిన నీరు మరో రెండు రోజుల వరకు వెళ్లే పరిస్థితి లేదు. అప్పటి వరకు ఇంట్లోలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. –ఆల్తాఫ్, కందకుర్తి

మాటలకందని విషాదం

మాటలకందని విషాదం

మాటలకందని విషాదం

మాటలకందని విషాదం

మాటలకందని విషాదం

మాటలకందని విషాదం