
10 వేల కోళ్లు మృతి
దోమకొండ: మండలంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో 10వేల కోళ్లు భారీ వర్షానికి మృతిచెందాయి. గ్రామానికి చెందిన గన్నమనేని పద్మకు ఎడ్లకట్ట వాగు సమీపంలో కోళ్లఫారాలు ఉన్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎడ్లకట్ట వాగు సమీపంలోని పంట పొలాల నుంచి నీరు ప్రవహించడంతో కోళ్లఫారాలు మునిగిపోయాయి. శనివారం వరద ఉధృతి తగ్గడంతో కోళ్లఫారాల యజమానులు అక్కడికి వెళ్లి చూడగా, అందులో ఉన్న పదివేల కోళ్లు బురదమట్టిలో కూరుకుపోయి చనిపోయి ఉన్నాయి. వెంటనే విషయాన్ని రెవెన్యూ, వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. ఆర్‌ఐ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ శివ అక్కడికి చేరుకుని పంచమానా చేశారు. దాదాపు రూ. 6లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పద్మ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు.