
రెండు రోజులుగా వరదలోనే పంటలు
బోధన్: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులను భారీ వర్షం, వరదలు అపార నష్టాలపాలు చేశాయి. రైతుల కష్టం, పెట్టిన పెట్టుబడి నీట మునిగాయి. సాలూర మండలంలోని మంద ర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రా మాల శివారులో వేలాది ఎకరాల సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయాలు, ఆకుకూర లు రెండు రోజులుగా వరద నీటిలోనే ఉన్నా యి. శనివారం మంజీర నది, వాగులకు వరద తగ్గుముఖం పట్టడంతో స్వల్ప విస్తీర్ణంలోని పంటలు తేలాయి. నీట మునిగిన పొలాలను చూసి రైతు లు లబోదిబోమంటున్నారు. ఆదివారం సా యంత్రం వరకు వరద నీరు తగ్గే అవకాశాలున్నా యి. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దెబ్బతిన్న పంటల పరిశీలన
సాలూర మండలంలోని తగ్గెల్లి గ్రామ శివారులో వరద కారణంగా నీటమునిగిన వరి, సోయా పంటలను బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. మందర్నా గ్రామంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పర్యటించి పరిశీలించారు. సాలూర పీహెచ్‌సీ, హున్సా హెల్త్ సబ్ సెంటర్ వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.

రెండు రోజులుగా వరదలోనే పంటలు

రెండు రోజులుగా వరదలోనే పంటలు

రెండు రోజులుగా వరదలోనే పంటలు

రెండు రోజులుగా వరదలోనే పంటలు