
పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఎస్సారెస్పీ సందర్శన
బాల్కొండ: గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గో దావరిలోకి వదులుతున్న నీటిని పరిశీలించారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీలోకి మ హారాష్ట్ర ప్రాంతంలోని గైక్వాడ్, విష్ణుపురి, బాలేగావ్‌లతోపాటు స్థానిక ఎగువ ప్రాంతాల్లోని నిజాంసాగర్, కౌలాస్‌నాలా, లెండి ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుందన్నారు. దీంతో బ్యాక్‌వాటర్ ఏరియాలతోపాటు దిగువన లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ముంపు తలెత్తకుండా ప్రాజెక్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రా జెక్ట్‌లో ప్రస్తుతం 57 టీఎంసీల నీటిని ఉంచుతూ.. వరద గేట్లు, కాలువల ద్వారా 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఎస్‌ఈ జగదీశ్, ఈఈ చక్రపాణి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
గంబూసియా చేపపిల్లలను పెంచాలి
దోమల నివారణ కోసం గంబూసియా చేపపిల్లల ను అధికంగా పెంచాలని మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో కావాల్సిన పనులు, ఉత్పత్తి చేసిన చేపపిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు, ఎఫ్‌డీవో దామోదర్ ఉన్నారు.