
గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బీబీపేట: బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగను పూడ్చడానికి ట్రాక్టర్‌పై బయలుదేరిన డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉప్పర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడడంతో ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన మన్నె రమేష్ తన ట్రాక్టర్ ద్వారా మట్టిని గత మూడు రోజులుగా తీసుకెళ్తున్నాడు. శనివారం మట్టిని తరలించే క్రమంలో అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
ఇందల్వాయి: ఇటీవల విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి తండాకు చెందిన జీపీ కార్మికుడు ఎడపల్లి చిన్న సాయిలు(41) వారం రోజుల క్రితం విద్యుత్ వీధి దీపాలను అమర్చుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్క చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సాయిలు మృతికి పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కారణమని పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గేదె..
బీబీపేట: మండలంలోని యాడారం గ్రామంలో కాటేం శ్రీనివాస్‌కు చెందిన గేదె శనివారం సమీపంలోని పొలాల్లో విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి శివకుమార్, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గేదె విలువ రూ. లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు.

గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి