
ప్రచారం సరే.. భద్రత ఏదీ?
ఆర్మూర్ టౌన్: వస్త్రాలపై ఆఫర్ అంటూ ఓ దు కాణ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ కొనుగోలుదారులకు తగిన భద్రత చర్యలు చేపట్టకపోవడంతో గందరగోళం నెలకొంది. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణ యజమానులు సోషల్ మీడియాలో రూ.పదికే షర్టు, రూ.పదికే ప్యాంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో వివిధ గ్రామాల ప్రజలు గురువారం ఉదయం నుంచే దుకాణం ఎదుట బారులు తీరారు. ఈక్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దుకాణం ఎదుట ఉన్న ప్రజలను చెదరగొట్టారు. అనంతరం దుకాణానికి తాళం వేసి, దుకాణ యజమానులకు అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో స త్యనారాయణగౌడ్ తెలిపారు. వేలాది మంది ఒ క్కసారిగా దుకాణంలోకి వెళ్తే తోపులాటలో ప్రా ణాలకు ముప్పు పొంచిఉంటుందని పలువురి అ భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఆ ఫర్లు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.