రికవరీ ఎందుకు చేయలేదు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, భూభారతి, వానాకాలం సా గు ప్రణాళిక అంశాలపై రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స మీక్ష చేశారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి ధాన్యం సేకరణపై అధికార యంత్రాంగాన్ని అభినందించారు. అయితే జిల్లాలో డిఫాల్ట్ మిల్లర్లు ఎంతమంది ఉన్నారని మంత్రి జూపల్లి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును అడిగారు. 44 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.250 కోట్ల మేర సీఎంఆర్ రావాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. 2014–15 నుంచి 2022–23 వరకు ఇవ్వాల్సిన సీఎంఆర్‌పై చర్యలేమి తీసుకున్నారని మంత్రి ప్రశ్నించారు. ఆర్‌అండ్‌ఆర్ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రూ.2.5 కోట్ల మేర రికవరీ చేసినట్లు కలెక్టర్ తెలుపగా, గత సమీక్షలోనూ ఇవే లెక్కలు చెప్పారని, రి కవరీ ఎందుకు చేయలేదని మంత్రి అసహనం వ్య క్తం చేశారు. నోటీసులిచ్చినట్లు కలెక్టర్ చెప్పగా, పదే ళ్లలో ఎన్ని నోటీసులు ఇచ్చారని, నోటీసులిస్తే పని అయినట్లేనా అని మంత్రి అన్నారు. తక్షణమే కేసుల మీద కేసులు పెట్టి అందుకనుగుణంగా షెడ్యూల్, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని 6 నెలల్లో రికవరీ చేయాలని జూపల్లి ఆదేశించారు. ఇదేమీ అసాధ్యమై టాస్క్ కాదని, అవసరమైతే మిల్లులను వేలం వేసి రికవరీ చేయాలన్నారు. వచ్చే వారంలో అధికారులందరూ అడ్వొకేట్ జనరల్‌తో కలిసి పూర్తి వివరా లతో హైదరాబాద్‌లో సమీక్షకు రావాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే రూ.10 లక్షలు ఖర్చు అయినా సరే ప్రత్యేక న్యాయవాదిని పెట్టుకుని ముందుకెళదామన్నారు. ప్రతి మిల్లువారీగా యాక్ష న్ ప్లాన్ సిద్ధం చేసుకుని రావాలన్నారు. అదనపు కలెక్టర్‌దే రికవరీ బాధ్యత అన్నారు. కామారెడ్డి జిల్లా లోనూ 49 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.45 కోట్లు రికవరీ కావాల్సి ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కేవలం రూ.4.4 కోట్లు మాత్రమే రికవరీ చేయడమేమిటని, మిగిలిన మొత్తం రికవరీ కోసం చర్యలు తీసుకోవాలని జూపల్లి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి 15 రోజులకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఫలితం సాధించాలన్నారు.
● నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యంగా పెట్టుకుని 752 ఇళ్లు మాత్రమే మంజూరు చేసినప్పటికీ.. ఒక్క ఇల్లు నిర్మాణం మాత్రమే ప్రారంభించడంపై మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల గ్రౌండింగ్ స్పీడ్ పెంచాలన్నారు.
80 శాతంపైగా సన్నధాన్యం సేకరణ
నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మంత్రికి వివరించారు. కాగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుని లక్ష్యానికి మించి ఇప్పటివరకు 8.21 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు. ఇందులో 80 శాతానికి పైగా 7.27 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం ఉందని తెలిపారు.
● కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చామని మంత్రి జూపల్లి అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిరుద్యోగ యువతకు బాసటగా నిలువాలని మంత్రి అధికారులకు సూచించారు. భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలెట్ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, జూన్ 3 నుంచి అన్ని మండలాల్లో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎంఆర్ రాబట్టడంలో చర్యలు
తీసుకోలేదెందుకు?
నోటీసులు ఇస్తే రికవరీ అయినట్లేనా?
కేసుల మీద కేసులు పెట్టండి..
మిల్లులను వేలం వేయండి
యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని
ఆరునెలల్లో రికవరీ చేయాలి
ఇదేమీ అసాధ్యమైన టాస్క్ కాదు
ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో
మంత్రి జూపల్లి కృష్ణారావు
యాసంగి ధాన్యం సేకరణపై
అధికారులకు అభినందనలు
ఉమ్మడి జిల్లాలో డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? పది సంవత్సరాల్లో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు? నోటీసులు ఇస్తే పని అయిపోయినట్లా? వారానికి ఒక నోటీసు ఇస్తే పదేళ్లలో ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఇలా చేస్తే రికవరీ అయినట్లేనా? గత సమీక్ష సమావేశంలోనూ ఇవే లెక్కలు చెప్పి మళ్లీ మార్పు లేకుండా అవే లెక్కలు చెప్పడమేమిటి?.. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను అడిగిన ప్రశ్నలివి.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
నిజామాబాద్ అర్బన్ స్లమ్ ఏరియాల్లోని ని రుపేదలకు భూసేకరణ చేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చే సేందుకు పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాల్లో ఉంటున్నవారిని గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో నిజామా బాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఎవరికీ పంచలేదని, అవి పాడయ్యాయని, మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ మంత్రిని కోరారు. మరమ్మతులు చేసి పేదలకు పంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టైంబౌండింగ్ పెట్టుకుని నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. టీఐఎఫ్ యూడీసీ కింద ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు పలు అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి, నిజామాబాద్ అర్బన్‌కు కేవలం 752 ఇళ్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇందు లో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే మొదలు పెట్టారన్నారు. మిగిలినవారికి స్థలాలు కేటాయించి ఇళ్లు ఇవ్వాలని మంత్రిని డిమాండ్ చేశారు. నాగారంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ ప్రారంభం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సమస్య లపై మంత్రి జూపల్లిని కోరారు.
రికవరీ ఎందుకు చేయలేదు?
రికవరీ ఎందుకు చేయలేదు?
రికవరీ ఎందుకు చేయలేదు?


