వంద మీటర్లు దాటితే జీతం కట్‌ | - | Sakshi
Sakshi News home page

వంద మీటర్లు దాటితే జీతం కట్‌

May 1 2025 12:27 AM | Updated on May 1 2025 12:27 AM

వంద మ

వంద మీటర్లు దాటితే జీతం కట్‌

నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, జీజీహెచ్‌లో హాజరు నమోదు చేసుకొని విధులకు డుమ్మా కొడదామనుకునే వారి ఆటలు ఇక చెల్లవు. ఆలస్యంగా డ్యూటీలకు వస్తూ ఠంఛనుగా జీతాలు పొందడానికి వీలుపడదు. నేటి నుంచి కొత్త హాజరు విధానం మొదలవుతోంది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఏఈబీఏఎస్‌ (ఆధార్‌ ఎనబుల్డ్‌ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌)ను తీసుకొచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. జిల్లాలో కొత్త హాజరు విధానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అందరికీ ఫేస్‌మార్క్‌ తప్పనిసరి..

నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు తదితర వైద్యులు ఎవరైనా సరే ఫేస్‌ మార్క్‌ అటెండెన్సు వేసుకోవాల్సిందే. గత రెండేళ్లు బయోమెట్రిక్‌ విధానం అమలు చేయగా, చాలా మంది వైద్యులు అటెండెన్సు వేసుకొని బయటకు వెళ్లడం సాధారణమైంది. ప్రధానంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సొంత ఆస్పత్రులున్న వైద్యులు వచ్చామా...పోయామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మిగతా వైద్యులు, ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. ఇలాంటి వ్యవహారాలకు చెక్‌ పెడుతూ ఎన్‌ఎంసీ ఫేస్‌మార్క్‌ అటెండెన్స్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, కొత్త విధానంతో వయస్సు రీత్యా వేలిముద్రలు రాక ఇబ్బంది పడుతున్న వైద్యులకు ప్రయోజనం కలుగనుంది.

అందరికీ వర్తింపు..

వైద్యులందరూ కచ్చితంగా తమ మొబైల్‌ ఫోన్లలో (ఏఈబీఏఎస్‌) ఫేస్‌మార్క్‌ అటెండెన్సు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. ఈ యాప్‌ జీజీహెచ్‌, మెడికల్‌ కళాశాలకు 100మీటర్ల పరిధిలోనే పని చేస్తుంది. 100 మీటర్ల దాటితే ఫేస్‌మార్కు కట్‌ అవుతుంది. దీంతో ప్రతి నిత్యం గంట, నిమిషాల చొప్పున కూడా జీతాల్లో కోత విధించనున్నారు. దీంతో నిత్యం నిర్ణీత వేళల్లో అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు మెడికల్‌ కాలేజ్‌, జీజీహెచ్‌లో ప్రత్యేకంగా డివైజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫోన్‌ ద్వారా వీలు కాకుంటే డివైజ్‌లో ఫేస్‌మార్కుతో అటెండెన్సు వేసుకొని విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించారు.

సిబ్బంది వివరాలు ఇలా..

వైద్యులకు ఫేస్‌మార్క్‌ హాజరు విధానం

నేటి నుంచి అమల్లోకి..

మెడికల్‌ కాలేజీ, జీజీహెచ్‌లో

‘ఏఈబీఏఎస్‌’

ప్రత్యేక యాప్‌, డివైజ్‌ల ఏర్పాటు

ఢిల్లీ నుంచి మానిటరింగ్‌

నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జీజీహెచ్‌లలో విధులు నిర్వర్తించే ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌, వైద్యులందరూ కచ్చితంగా ఫేస్‌మార్కు అటెండెన్సు వేసుకోవాలి. ఢిల్లీలోని ఎన్‌ఎంసీ మానిటరింగ్‌ చేస్తుంది. సమయ పాలనతోపాటు నియమ నిబంధనలు పాటించాలి. లేకపోతే జీతాల్లో కోత పడుతుంది.

– డాక్టర్‌ శివప్రసాద్‌, ప్రిన్సిపాల్‌, మెడికల్‌ కాలేజీ

వంద మీటర్లు దాటితే జీతం కట్‌ 1
1/1

వంద మీటర్లు దాటితే జీతం కట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement