
అందాల పొదరిల్లు
ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా..
75 ఏళ్లుగా చెక్కు చెదరని ఇళ్లు
రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు.
సాలూరలోని పెంకుటింట్లో టేకు దూలాలు, వాసాలు