
కుక్కల దాడిలో పసి బాలుడికి గాయాలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం ఉదయం శ్రేయన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి కుక్కను తరిమేసి, గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులు ఇప్పటిౖకైనా కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మద్నూర్‌లో లేగదూడలకు..
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు లేగదూడలపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గోశాలలోకి మంగళవారం ఉదయం కుక్కల గుంపు ప్రవేశించి లేగదూడలపై దాడి చేశాయన్నారు. దీంతో లేగదూడలకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. మరో రెండు లేగదూడలు పారిపోయాయని వాటి కోసం వెతుకుతున్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు.