
బాలికలదే పైచేయి
నిజామాబాద్
భూ సమస్యల పరిష్కారానికే..
భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు.
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లో u
ఇంటర్ ఫలితాల్లో బాలికలు మరోసారి పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 53.37 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 58.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు ఫస్టియర్‌లో 64 శాతం, బాలురు 41శాతం, సెకండియర్‌లో బాలికలు 70 శాతం, బాలురు 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 13,945 మంది పరీక్షలకు హాజరుకాగా 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ ఒకేషనల్‌లో 2,042 మందికి గాను 1,231 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు 15,056 మందికిగాను 8,035 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్‌లో 2,790 మందికిగాను 1,223 ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచింది. – నిజామాబాద్ అర్బన్
న్యూస్‌రీల్