
ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండగ
ధర్పల్లి: దుబ్బాకలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇంటికొక్క బోనం చొప్పున, డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు, యువకులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా పెద్దమ్మ గుడికి తరలి వెళ్లారు. పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రుద్రూర్: మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం(ఇంగ్లీ్‌ష్ మీడియం)లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రత్యేకాధికారిణి బి.శ్యామల తెలిపారు. ఆరో తరగతిలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయ ని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు స్కూల్ బోనాఫైడ్, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జనన, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొ టోలు జతపర్చాలని పేర్కొన్నారు. అర్హత, సీట్ల కే టాయింపులో అనాథలు, తల్లి, తండ్రి లేని వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేస్తామన్నారు.