గతేడాది కంటే ఎక్కువే.. | - | Sakshi
Sakshi News home page

గతేడాది కంటే ఎక్కువే..

Apr 18 2025 1:47 AM | Updated on Apr 18 2025 1:47 AM

గతేడా

గతేడాది కంటే ఎక్కువే..

బాల్కొండ : లక్ష్మి కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఈ నెల 9న అధికారులు నిలిపివేశారు. అయి తే మెండోరా మండలం బుస్సాపూర్‌, నల్లూర్‌, ము ప్కాల్‌ మండలం కొత్తపల్లి, నల్లూర్‌ గ్రామాల్లో వరి పంటలు ఇంకా కోతకు రాలేదు. ఒక్క తడి నీరంది తే చాలు పంటలు గట్టెక్కుతాయి. ఇదే విషయాన్ని అధికారులకు చెబితే ప్రాజెక్ట్‌ నుంచి ప్రస్తుతం చుక్క నీరు వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు లీకేజీ నీటికి అడుగడుగునా అడ్డుకట్ట వేసి తూముల వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు.

ప్రాజెక్ట్‌ నుంచి కాలువ ద్వారా 100 క్యూసెక్కు ల నీటిని వదిలినా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉ న్నతాధికారులు స్పందించి లక్ష్మికాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో గతేడాది కంటే ఎక్కు వ నీరు నిల్వ ఉంది. గతేడాది ప్రాజెక్ట్‌లో 8.9 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ప్రస్తుతం 11.44 టీఎంసీల నీరుంది. అయినా ప్రాజెక్ట్‌ నుంచి ఆయకట్టు పంటలను కాపాడేందుకు అధికారులు నీటి విడుదలను చేపట్టడం లేదని రైతు లు ఆరోపిస్తున్నారు. లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల కోసం హెడ్‌ రెగ్యులేటర్‌ ఎత్తిపోగా, లక్ష్మి లిప్టును వినియోగించి నీటి విడుదల చేపట్టొచ్చు. కానీ, ప్రాజెక్ట్‌ అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదని తెలుస్తోంది. చివరి తడికి నీరు అందించకుంటే సుమారు వెయ్యి ఎకరాల మేర పంట ఎండిపోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకులు పట్టించుకోవాలి

100 క్యూసెక్కుల నీరు మూడ్రోజులు వదిలినా మా పంటలకు నీరు అందుతుంది. ప్రాజెక్ట్‌లో కూడా నిరుడు కంటే ఎక్కువగానే నీరుంది. పాలకులు పట్టించుకొని పంటలను కాపాడాలి.

– గౌతం, రైతు, బుస్సాపూర్‌

నీటిని విడుదల చేయాలి

నీరందక వరి పంట ఎండిపోతుంది. ఒక్క తడి అందిస్తే పంటలు గట్టెక్కుతాయి. ఏటా ఇదే తిప్పలు అవుతుంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలి.

– గంగారాం, రైతు, బుస్సాపూర్‌

గతేడాది కంటే ఎక్కువే..1
1/2

గతేడాది కంటే ఎక్కువే..

గతేడాది కంటే ఎక్కువే..2
2/2

గతేడాది కంటే ఎక్కువే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement