న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు కీలక బలం
ఆర్మూర్‌టౌన్: న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు కీలక బలమని, న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర గౌరవంతో పనిచేస్తేనే ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ కోర్టులోని న్యాయవాదుల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి జడ్జి హాజరై మాట్లాడారు. నూతన కార్యవర్గం న్యాయవాదుల బార్ అసిసియేషన్ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణా స్వీకారం చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, అడిషనల్ జడ్జి సరళరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జక్కుల శ్రీధర్, జెస్సు అనిల్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జెల, చైతన్య, సంయుక్త కార్యదర్శి గంగారాం, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


