ఖలీల్‌వాడి: వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలోని పెరిక సంఘం సభ్యులు నిర్మించిన ఫంక్షన్ హాల్ గేట్‌తో గజ్జెలమ్మ ఆలయానికి ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు కలెక్టర్, సీపీకి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. జీపీ అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించారని, అలాగే గేటు ఏర్పాటు చేయొద్దని చెప్పినా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ గేటు ఏర్పాటుతో భక్తులు ఆలయంలోకి వెళ్లలేకపోతున్నారని అన్నారు. అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాములు, గైని గోపి, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.