మోర్తాడ్(బాల్కొండ): మందుల కోసం మెడికల్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. మండలంలోని తిమ్మాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పల్లెపు గంగు అనే మహిళ తిమ్మాపూర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను మాటల్లో దింపి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దుండగుల కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్ సీఐ శ్రీనివాస్, ఏర్గట్ల ఎస్సై మచ్ఛేందర్‌రెడ్డి, మోర్తాడ్ ఏఎస్సై గోపాల్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.