కామారెడ్డి క్రైం: దోమకొండ మండలం అంబారీపేట గ్రామానికి చెందిన సింగం రేణుక అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆమె భర్త పరశురాములుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 8 గంటలకు అడ్మిట్ చేశారు. ఆయన చికిత్స జరుగుతుండగానే 11 గంటల సమయంలో రేణుక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. రేణుక ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
మందర్నకు చెందిన వ్యక్తి..
బోధన్‌రూరల్: సాలూర మండలంలోని మందర్న గ్రామానికి చెందిన పీరాజీ (40) అదృశ్యమైనట్లు బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ తెలిపారు. పీరాజీకి కొంతకాలంగా మతిస్థిమితం లేదని, ఈ ఏడాది జనవరి 19న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన తిరిగిరాలేదన్నారు. కుటుంబ సభ్యులు అప్పటి నుంచి పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment