అగ్నిప్రమాదాలపై అవగాహన | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాలపై అవగాహన

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద మహిళలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్‌ రావు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సిలెండర్‌లో మంటలు వస్తే ఎలా ఆర్పివేయాలో అవగాహన కల్పించారు. అలాగే మనోరమ హాస్పిటల్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వస్తే ఎలా స్పందించాలి అనే అంశాల గురించి వివరించారు.

మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌నాగారం: నగరంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్‌ నీతూకిరణ్‌, నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్‌కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. స్నేహసొసైటీలో మానసిక వికలాంగుల మధ్య గణేష్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. బస్టాండ్‌ వద్ద పార్టీ నాయకుడు సుజిత్‌ సింగ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. నాయకులు ఫయాజుద్దీన్‌, సుదాం రవిచందర్‌, మురళి, ధర్మపురి, గాండ్ల లింగం, మహేష్‌, సత్యపాల్‌, చింతకాయల రాజు, ప్రసాద్‌, కరిపే రాజు, శంకర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

నిజామాబాద్‌నాగారం: నగరంలోని పలు వార్డులకు చెందిన సభ్యులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నగరంలో బుధవారం వారికి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ పార్టీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఇండియా జైహింద్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆల్‌ వర్కర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అధ్యక్షులు నరసింహచారీ, ప్రధాన కార్యదర్శి షేక్‌ షాబాద్‌, కోశాధికారి షేక్‌ కాసిం తదితరులు ఉన్నారు.

సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దు

నిజామాబాద్‌అర్బన్‌: వేసవి సెలవుల్లో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల నిర్వాహకులు తరగతులు నిర్వహించొద్దని, ఒకవేళ నిర్వహిస్తే విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు గణేష్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని, నిబందనలు పాటించకుండ కొనసాగుతున్నాయన్నారు. సంఘ ప్రతినిధులు ఆజాద్‌, కటారి కార్తీక్‌, అభిలాష్‌, ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా సుమన్‌

నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ధర్మసమాజ్‌ పార్టీ తరపున కండెల సుమన్‌ పోటీచేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీసి, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని అప్రమత్తం చేసి సమాయత్తం చేయడానికి ధర్మసమాజ్‌ పార్టీ సిద్ధపడిందని విశారదన్‌ అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలంతా ధర్మ సమాజ్‌ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

మునీర్‌ సంతాప సభ

ఖలీల్‌వాడి: నగరంలోని బహుజన కాలనీలో బుధవారం ఉద్యమ నాయకుడు సీపీఎం నగర కమిటీ సభ్యుడు మునీర్‌ హైమద్‌ సంతాప సభను పార్టీ నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. మునీర్‌ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారన్నారు. నగర కార్యదర్శి సూరి, సుజాత, విగ్నేష్‌, మహేష్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

1/4

2/4

3/4

4/4

Advertisement
 
Advertisement