ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా | Sakshi
Sakshi News home page

ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా

Published Sat, Nov 25 2023 1:24 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్‌ అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్‌ నగరం ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసని పేర్కొన్నారు. తనకన్న ముందు ఉన్నవారు నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇందూరును దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి అనుక్షణం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.' ఎన్నికల నేపథ్యంలో గణేశ్‌గుప్తాతో సాక్షి ఇంటర్వ్యూ.. – నిజామాబాద్‌ నాగారం

నగర అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు?
► నిజామాబాద్‌ నగరాన్ని ఇప్పటి వరకు రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేశాను. విశాలమైన రోడ్లు, డివై డర్లు, పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, మినీ ట్యాంక్‌బండ్‌, సమీకృత మార్కెట్‌ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే అండర్‌ బ్రిడ్జి, ఐటీ హబ్‌, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తి చేశాను. 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు నును చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మోడల్‌ బుక్‌లెట్‌ పంపిణీ చేశా. దానిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజల కళ్ల ముందు ఉంచాను.

యూజీడీ పనులు పూర్తయ్యాయా?
► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే జరిగా యి. రోడ్లను మధ్యలో తవ్వేయడంతో రాకపోకలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్‌ ను అడిగి నిధులు తెచ్చి 2019లో యూజీడీ పనులు పూర్తి చేయించాను. ప్రతి ఇంటి నుంచి యూజీడీకి కనెక్షన్‌ ఇవ్వాలి. దీనికి ఒక్కొక్కరికి రూ.8 వేలకు పై గా ఖర్చు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ను ఒప్పించి రూ.45కోట్ల నిధులు తెచ్చి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయించాను. ఎన్నికలు పూ ర్తి కాగానే ఈ పనులు ప్రారంభం అవుతాయి.

ప్రస్తుతం నగరంలో తాగునీటి సమస్య ఉందా?
► నగరంలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చెక్‌ పెట్టడానికే మిషన్‌ భగీరథ ద్వారా పైపులైన్‌లు వేశాం. 24గంటల పాటు మంచినీరు సరఫరా చేయడానికి కార్యాచరణ రూపొందించాం.

ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
► నేను అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. నగరంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పరిష్కరించా. నేను చేసిన అభివృద్ధిపై బుక్‌లెట్‌ ప్రింట్‌ చేసి ఇంటింటికి పంచుతూ ఓట్లు అడుగుతున్నా. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలే నా ధైర్యం, నమ్మకం.. మూడోసారి గెలిపిస్తారని నమ్ముతున్నా.

ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారం చేపట్టారు. అన్ని కులాలకు దగ్గరయ్యారా?
► నేను ఎల్లవేళలా ప్రజలతో ఉన్నా. నగరంలోని అ న్ని డివిజన్లలో పర్యటించాను. కులమతాలకు అతీతంగా కుల సంఘాలకు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు ఇచ్చి భవనాలు పూర్తి చేయించాను. ఆత్మీయ సమ్మేళనాలతో నేను ఏం చేశానో ప్రజలకు వివరించాను.

ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది?
► సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల కేసీఆర్‌ భీమా, సన్నబియ్యం, ఆసరా పెన్షన్‌ రూ.5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతు బంధు రూ.16వేలు, మహిళలకు రూ. 3 వేలు అందిస్తాం. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం.

ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
► ఎన్నికలు వస్తాయి, పోతాయి. రకరకాల పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక్కసారి గుండె మీద చె య్యి వేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేను తొమ్మిదిన్నర ఏళ్లలో నగరాన్ని ఎవరూ చేయని వి ధంగా అభివృద్ధి చేశా. నా కన్న ముందు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా అభివృద్ధి చేయలేదు. అ నుక్షణం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ, సదుపాయాలు కల్పించా. నగరాన్ని రాష్ట్రంలో, దేశంలో నంబర్‌ వన్‌గా ఉంచడాని కి కష్టపడుతునే ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ప్రజల కు అండగా ఉంటున్నా. అందుకే ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.
ఇవి కూడా చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ..

 

 
Advertisement
 
Advertisement