మెక్సికోలో రెంజల్‌ యువకుడి గల్లంతు | Sakshi
Sakshi News home page

మెక్సికోలో రెంజల్‌ యువకుడి గల్లంతు

Published Sat, Nov 18 2023 1:22 AM

- - Sakshi

రెంజల్‌: మెక్సికోలో మండల కేంద్రానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి అనే యువకుడు గల్లంతయ్యాడు. బాధిత కుటుంబీకులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు నిమిత్తం మెక్సికోలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పదినెలల నుంచి పనిచేస్తున్నాడు. ఓడలోని హోటల్‌మెనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడి గల్లంతైనట్లు చెప్పారు. యువకుడు పనిచేస్తున్న కంపెనీ వారు పూర్తి సమాచారం అందించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఒకరి అదృశ్యం

మాక్లూర్‌: మండలంలోని ముల్లంగి(బి) గ్రామానికి చెందిన బూరోల్ల రాజు అదృశ్యమైనట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. రాజు ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. రాజు భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

తనిఖీల్లో నగదు పట్టివేత

నిజాంసాగర్‌: మండలంలోని నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఒకరి నుంచి రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ శుక్రవారం తెలిపారు. నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఉన్నతాధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

 
Advertisement
 
Advertisement