గుబులు రేపుతున్న గోర్త రాజేందర్‌ | Sakshi
Sakshi News home page

గుబులు రేపుతున్న గోర్త రాజేందర్‌

Published Wed, Nov 15 2023 12:42 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆర్మూర్‌ నియోజకవర్గంలో గోర్త రా జేందర్‌ గుబులు రేపుతున్నారు. పార్టీ టికెట్టు కోసం ఢిల్లీ స్థా యిలో తుది వరకు గట్టిగా ప్రయత్నాలు చేసి విఫలమైన రాజేందర్‌ కాంగ్రె స్‌, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పా ర్టీ పేరిట దాఖలు చే సిన నామినేషన్‌ మంగళవారం తిరస్కరణకు గురికాగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నామినేషన్‌ ఫోర్స్‌లో ఉంది.

ఉపసంహరణకు బుధవారం ఆఖరుతేదీ కావడంతో శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్‌ టికెట్టుతో బరిలో ఉన్న వినయ్‌రెడ్డి తమను కలుపుకుపోవడం లేదనే అసంతృప్తిని కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేందర్‌ అంశం మరింత అలజడి కలిగిస్తోంది. రాజేందర్‌ బీసీ వాదనతో బరిలో ఉంటారా అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది.

బీసీలకు దక్కని కాంగ్రెస్‌ టికెట్టు
కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి పార్లమెంట్‌ ని యోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు సీట్లు బీసీలకు కేటాయించాలనే డిమాండ్‌ నడిచింది. అయితే ని జామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ స్థా నాలను బీసీలకు కేటాయిస్తా రని పార్టీ వర్గాలు ముందునుంచే చెబు తూ వచ్చాయి. అ నూహ్య పరిణామాల నేపథ్యంలో బీసీల కు ఒక్క సీటూ దక్కలేదు. ని జామాబాద్‌ అ ర్బన్‌తో పాటు ఆర్మూర్‌ సీట్లు బీసీలకు వచ్చినట్లే వచ్చి చివరి నిముషంలో చేజారాయి. బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన గోర్త రాజేందర్‌ ఇప్పటికే ఆర్‌ కృష్ణయ్యను కలిసి టచ్‌లో ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మున్నూరుకాపు సామాజిక వర్గానివే ఉన్నాయి.

దీంతో తనకు మంచి ఫ్లాట్‌ఫాం ఏర్పడనుందని రాజేందర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజేందర్‌ నామినేషన్‌ ఉపసంహరించుకుంటారా.. లేదా బరిలో ఉంటారా అనే సందిగ్ధత నెలకొంది. నామినేషన్‌ ఉపసంహరించుకోకుండా కొనసాగితే మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జర గడం ఖాయమని సీనియర్లు అంటున్నారు. ఇ ది లా ఉండగా తాను బీసీ వాదన వినిపించేందుకు, బీసీల ఉనికిని చాటేందుకు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసినట్లు రాజేందర్‌ చెబుతూ వస్తుండడం గమనార్హం.

ఇక పార్టీ కోసం ఏళ్లతరబడి కష్టపడిన తమను కలుపుకుని ముందుకెళ్లే విషయంలో అంతగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కొందరు బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై గళం బలంగా వినిపించడంలో దిట్టగా ఉన్న రాజేందర్‌ సై తం నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే ఇ బ్బందులు తప్పవని ఆ పార్టీ సీనియర్లు వాపోతున్నారు.

Advertisement
Advertisement