నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Nov 28 2026 1:14 AM | Updated on Nov 28 2026 1:14 AM

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ఏఎస్పీ సాయికిరణ్‌

జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సుజాత

కేంద్ర కేబినెట్‌ ఆమోదంతో మరోసారి చర్చ

లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్లతో మార్పులు

మారనున్న ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖ చిత్రం

ట్రిపుల్‌ ఐటీలో సైబర్‌ భద్రత

బాసర ట్రిపుల్‌ ఐటీలో సైబర్‌ భద్రతపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

నిర్మల్‌టౌన్‌: బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలతో భవిష్యత్తు దెబ్బతింటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.రాధిక పేర్కొన్నారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినం సందర్భంగా నిర్మల్‌ అర్బన్‌ కస్తూర్బా బాలికల విద్యాలయంలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార చట్టం, బా ల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సుజాత, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: డీలిమిటేషన్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌తో పాటు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్‌ శుక్రవారం డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ చర్చకు తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు, 33 శాతం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం ఎన్‌డీఏ సర్కారు ముందుకెళ్తోంది. గత ఏప్రిల్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో తాజాగా మరోసారి ఈ నెల 30న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. బిల్లుల ఆమోదం కోసం మద్దతు కూడగడుతోంది. ఇప్పుడున్న లోక్‌సభ 543 స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలైన ఆదిలాబాద్‌, పెద్దపల్లి పరిధిలోనూ మార్పులు జరగనున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లు సైతం ఆమోదం పొందితే నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. దీంతో ఇప్పుడున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో సహా ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యే కావాలని ఆరాటపడుతున్న ఆశావహులు ఎక్కడ పోటీ చేయాలనేది స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాక ఒక్కో నియోజకవర్గంలో లక్షలాది ఓటర్లు ఉన్న నియోజకవర్గాల స్థానాలు మారనున్నాయి.

అసెంబ్లీ స్థానాలు సైతం

ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలైన ఆదిలాబా ద్‌, బోథ్‌, నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌, మంచిర్యా ల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్లపైనే. ఇక పూర్తిస్థాయి బిల్లులో ఏముందని ఇంకా స్పష్టత లేదు. అయితే రాష్ట్ర విభజనలోనే నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన ఉంది. డీలిమిటేషన్‌ బిల్లుతో అసెంబ్లీ స్థానాలు సైతం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా నియోజవకర్గాల ఏర్పాటుతోనూ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో శాసనసభ స్థానాల్లో రిజర్వేషన్ల మార్పులు, ఆయా మండలాల్లోకి పరిధి దాటడం వంటివి జరగనున్నాయి.

మారనున్న నేతల రాతలు

డీలిమిటేషన్‌తో కొత్త వారికి అవకాశాలు రావడంతో పాటు సీనియర్‌ నాయకులకు నియోజకవర్గాల్లో పట్టు సాధించడం కష్టంగా మారనుంది. కొన్నేళ్లుగా తమ స్థానాల్లో పట్టు పెంచుకుని స్థానికంగా బలమైన నాయకులుగా ఎదిగారు. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాల్లో రాజకీయంగా ముందుకు వెళ్లడం కష్టంగా మారనుంది. ఇక మహిళా బిల్లు ఆమోదం పొందితే నారీమణులకు అవకాశాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే కనీసం మూడు స్థానాలు మహిళలకే రిజర్వు అయ్యే అవకాశం ఉంది.

మాట్లాడుతున్న ఏఎస్పీ సాయికిరణ్‌

లెక్కలు వేసుకుంటున్న నేతలు..

ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ స్థానాలు మారితే ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలోనూ రాజకీయంగా సమీకరణలు సిద్ధం చేసుకున్నారు. అయితే డీలిమిటేషన్‌ కమిటీ ఏర్పాటై, నియోజకవర్గాల సరిహద్దులు మారితే రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement