రబీలో ఆరుతడి పంటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

రబీలో ఆరుతడి పంటలు వేయాలి

Nov 28 2026 1:14 AM | Updated on Nov 28 2026 1:14 AM

లక్ష్మణచాంద: రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకే అన్నదాతలు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సుజాత అన్నారు. సోన్‌ మండలం న్యూ వెల్మల్‌ గ్రామంలోని బయో రీసెర్చ్‌ సెంటర్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. బోరుబావులు ఉన్న రైతులు తప్పనిసరిగా బోరు బావుల వద్ద రీచార్జ్‌ పిట్లు నిర్మించుకోవాల న్నారు. బయో రాసెర్చర్‌ సెంటర్‌ కేంద్రం నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలును పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు అయిన పంటల సాగుకు రబీ సీజన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజల పంటలతోపాటు శనగ, వేరుశనగ, మినుము, పెసర వంటి పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలన్నారు. కూరగాయల సాగు, పాడి పరిశ్రమపైనా రైతులు దృష్టి సారించాలని తెలిపారు. గత సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన భూముల్లో పంట మార్పిడిలో భాగంగా ప్రస్తుతం సాగు చేస్తున్న జొన్న పంటను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతీ రైతు కృషి చేయాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు రాజశేఖర్‌రెడ్డి, ఆసం రవి, సోన్‌ మండల వ్యవసాయాధికారి వినోద్‌, ఏఈవోలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement