తానూరు: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని బెల్‌తరోడాలో దేవాదాయ శాఖ నుంచి మంజూరైన రూ.30 లక్షల నిధులతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్‌తరోడ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.1.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బెల్‌తరోడా నుంచి నిర్మల్ వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణాకి రూ.14 వందల కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపా సుజత, నాయకులు గోపా సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.


