కడెం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో ప్రీపైమరీ పాఠశాలలను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 216 ప్రీప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు ఒక ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించింది. టీచర్లకు రూ.8వేలు, ఆయాలకు రూ.6 వేల వేతన ఒప్పందంతో విధుల్లో చేరారు. పాఠశాలల్లో చిన్నారుల సంరక్షణ, బోధనలో కీలకపాత్ర పోషిస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు ఐదునెలలుగా వేతనాలు విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్, డీఈవోకు వినతిపత్రాలు అందజేసినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
ప్రతీ నెల వేతనాలు చెల్లించాలి
ఈ ఏడాది జూన్ నుంచి లింగాపూర్ ప్రీప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణకు, కనీస అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ప్రతీ నెల వేతనాలు ఇవ్వాలి.
– అంజలి, ప్రీప్రైమరీ టీచర్, లింగాపూర్


